రెండు భాషల్లోనే రిలీజ్ చేసి, మూడు వారాల్లోనే 300 కోట్లు

తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి 200-250 కోట్ల క్లబ్ లో చేరడమే కష్టం అవుతున్న టైములో, ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమా తెలుగు తమిళ భాషల్లోనే రిలీజ్ అయ్యి ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే 150 కోట్లు రాబట్టిన బిగిల్, ఆ తర్వాత మూడో వారానికి మరో 150 కోట్లు వసూళ్లు చేసి 300 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయిన ఇదే సినిమా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ చేరింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన బిగిల్ సినిమాని అట్లీ తెరకెక్కించాడు. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు పీసెర్ హిట్స్ రావడంతో బిగిల్ పై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల స్థాయిని దాటేసిన బిగిల్, విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చేరింది. దీంతో 200 కోట్లు వరసగా మూడు సార్లు రాబట్టిన మొదటి హీరోగా, మూడు వందల కోట్లు రాబట్టిన ఏకైక హీరోగా విజయ్ నాన్ రజినీ రికార్డు క్రియేట్ చేశాడు.