నీ లాంటి హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ చెన్నై హై కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. విజయ్‌ 2012లో రోల్స్ రాయిస్ కారుని కొన్నాడు. ఈ కారుకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని విజయ్ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హై న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. విజయ్ పిటిషన్ ని తోసిపుచ్చిన హైకోర్ట్ జరిమానా విధించింది. ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కారు కాబట్టి తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి ఎం సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పేశారు.

అంతే కాకుండా కోట్లు సంపాదిస్తున హీరోలు పన్ను కట్టేందుకు వెనుకాడుతున్నారు అంటూ హై కోర్ట్ సీరియస్ అయింది. అలాగే పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను హీరో విజయ్ కి ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించింది. విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం వినియోగించాలని న్యాయమూర్తి తెలిపారు. రజినీకాంత్ తర్వాత అంతటి స్టార్ హీరో అయిన విజయ్ ఇలా కార్ కి ట్యాక్స్ కట్టకుండా మినహాయింపు అడగడం ఏంటో ఆయనకే తెలియాలి అంటూ కొందరు కోలీవుడ్ సినీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. హీరోలుగా తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా ఉంటే మంచి పౌరుడిగా దేశానికి మంచి చేసిన వాడవుతాడు.