#Thalaivar168 అనౌన్స్మెంట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది

సూపర్ స్టార్ అంటే ఇండస్ట్రీకి ఒక పేరు వినిపిస్తుంది కానీ ఇండియాస్ సూపర్ స్టార్ అంటే అందరి నుంచి అన్ని వర్గాల సినీ అభిమానుల నుంచి వినిపించే ఒకేఒక్క పేరు రజినీకాంత్, సూపర్ స్టార్ రజినీకాంత్. రాజకీయాల్లోకి వస్తున్నాడు సినిమాలు చేయడు, హిట్ పడలేదు కలెక్షన్స్ రావట్లేదు. రజినీ హెల్త్ బాగోలేదు, ఇక నెమ్మదిగా సినిమాలు తగ్గించి రాజకీయాలపై దృష్టిపెట్టడం నయం. ఇవి గత అయిదేళ్లుగా రజినీకాంత్ గురించి వినిపిస్తున్న మాటలు. తన పని అయిపోయిందనుకున్న వాళ్లందరికీ రజినీ సాలిడ్ ఆన్సర్ ఇస్తూ సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు. కబాలి, కాలా, 2.0, పేట… ఒకదానికి మించి మరో సినిమా చేసిన రజినీ, పేట సినిమాతో పాత తలైవనే చూపించాడు. ఫ్యాన్స్ రజినీకాంత్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో పేట సినిమా అదే రేంజులో చూపించింది. ఇప్పుడు మురుగదాస్ తో దర్బార్ సినిమా చేస్తున్న రజినీ, చాలా ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు.

దర్బార్ సెట్స్ పై ఉన్నా తన పార్ట్ షూటింగ్ పూర్తి చూసిన రజినీకాంత్, తన నెక్స్ట్ సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. రోబో, పేట సినిమాని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ మూవీని ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. చాలా రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పేట మ్యూజిక్ తో అనౌన్స్ చేసారు కాబట్టి అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం ఉంది. #Thalaivar168 అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఈ అనౌన్స్మెంట్ హల్చల్ చేస్తూ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. తలైవా లాంటి మాస్ హీరోకి, సిరుత్తై శివ లాంటి కమర్షియాయ్ల డైరెక్టర్ తగిలితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ కమర్షియల్ సినిమాకి హీరోయిజాన్ని కలిపి ఎలివేట్ చేయడం దిట్ట అయిన శివ, ఇప్పటివరకూ తల అజిత్ తోనే సినిమా చేశాడు. ఇప్పుడు ఏకంగా తలైవాతోనే చేస్తున్నాడు. మరి తలకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శివ, తలైవాకి ఏ రేంజ్ హిట్ ఇస్తాడు? ఎలాంటి కథతో సినిమా చేస్తాడు అనేది చూడాలి.