టపాసుల మోతతో తల అజిత్ ‘వాలిమై’

తమిళనాట పర్ఫెక్ట్ మాస్ అండ్ క్లాస్ హీరో అంటే ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అజిత్, తల అజిత్. స్టార్ డమ్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అజిత్, 2019లో వచ్చిన నెర్కొండ పార్వై తర్వాత మరో సినిమా చేయలేదు. తల అభిమానులు అజిత్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. నెర్కొండ పార్వై రీమేక్ అవ్వడం, కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అవ్వడంతో… ఆ మూవీ హిట్ అయినా కూడా అజిత్ అభిమానుల ఆకలి తీరలేదు. ఈ ఆకలి తీర్చడానికే హెచ్ వినోద్ తోనే అజిత్ వాలిమై మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత పోలీస్ గా కనిపించనున్న అజిత్, మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం కూడా అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ ని షేక్ చేశారు. వీరు చేసిన విధ్వంసం ఎలాంటిది అంటే ముంబైలో ఉన్న బోనీ కపూర్ కూడా భయపడి సరైన సమయంలో అప్డేట్ ఇస్తాము వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అయినా ఆగని అభిమానులు సోషల్ మీడియాలో వాలిమై అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటే, ఇక చేసేదేమి లేక స్వయంగా అజిత్ బయటకి చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ వచ్చే వరకూ హుందాగా నడుచుకోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లిన వాలిమై షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే కోలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ‘వాలిమై’ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారట. ఈ ఏడాది దీపావళి గురువారం వచ్చింది, దీంతో వాలిమైకి లాంగ్ వీకెండ్ దొరికే అవకాశం ఉంది. అందుకే ఆ రోజున రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అజిత్ కి విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. ఇది కార్తికేయకి తమిళ డెబ్యూ మూవీ అవుతుంది అనడంలో సందేహం లేదు.