ఆ రెండు ఒకే రోజు చెప్పనున్న అజిత్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాడు. సెలెక్టివ్ సినిమాలని మాత్రమే చేస్తూ హిట్స్ అందుకునే అజిత్, పింక్ రీమేక్ గా వచ్చిన నేర్కొండ పార్వై తర్వాత ఇప్పటివరకూ మళ్లీ థియేటర్స్ లో కనిపించలేదు. నేర్కొండ పార్వై టీం మొత్తం కలిసి అజిత్ తో వాలిమై అనే మూవీ చేస్తున్నారు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ భై యాక్షన్ మూవీ అప్డేట్ కోసం తల అభిమానులు దాదాపు ఏడాదిన్నరగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా స్టిల్స్ చూసినవారు ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా అనే అనుకుంటున్నారు. కానీ ఇందులో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. మనసులను కదిలించే ఎమోషన్ ఉంటుందని చెబుతున్నారు. యువన్ శంకర్ రాజా ‘అమ్మ’పై స్వరపరిచిన ఒక పాట అందరి హృదయాలను టచ్ చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో అజిత్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నటిస్తోంది. ఇక విలన్ గా హీరో కార్తికేయ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో విలన్ గా కూడా కార్తికేయ బిజీ కానున్నాడని చెబుతున్నారు. ‘నెర్కొండ పారవై’ భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి వాలిమై సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకూ టీజర్ కూడా బయటకి ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలోనే టీజర్ అప్డేట్ తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నారు.