ఇచ్చిన మాట కోసమే అజిత్ పని చేస్తున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందు ఉంటాడు. ఒక నిర్మాతని నమ్మితే అతనితోనే సినిమాలు చేస్తూ ఉంటాడు, గతంలో శివజ్యోతి పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు చేసిన అజిత్ ఇప్పుడు బోణీ కపూర్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. శ్రీదేవికి ఇచ్చిన మాట కారణంగా నేర్కొండపార్వై సినిమాని చేసిన అజిత్, ఇప్పుడు అదే బ్యానర్ లో హెచ్ వినోద్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఇది అయిపోయాక అజిత్, మురుగదాస్ లేదా అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తాడు అనుకుంటే మళ్లీ బోణీ కపూర్ బ్యానర్ లోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా రీమేకే కావడం విశేషం. ఇప్పటికే పింక్ సినిమాని రీమేక్ చేసిన అజిత్, రీసెంట్ గా హిందీలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ఆర్టికల్ 15 సినిమాని తమిళ ప్రేక్షకులకి అందించడానికి రెడీ అయ్యాడు. సీరియస్ గర్ల్ ఇష్యూ డిస్కస్ చేసిన ఆర్టికల్ 15 సినిమా కోలీవుడ్ ప్రేక్షకులకి మంచి సినిమా చూసే అనుభుతి కలుగుతుంది. కానీ అజిత్ లాంటి స్టార్ హీరో ఇచ్చిన మాట కోసం ఒకే ప్రొడక్షన్ హౌజ్ కి సినిమాలు చేయడం నిజంగా గొప్ప విషయం.