Chennai: షూటింగ్ పోటీల్లో గెలిచిన తాలా అజిత్‌.. ఏకంగా 4స్వ‌ర్ణ ప‌త‌కాలు!

Chennai: ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ తాలా అజిత్ అంటేనే త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఆరాధ్య న‌టుడు. ఆయ‌న సినిమాలు వ‌స్తే అభిమానులు ఎంతో హాడావుడి చేస్తారు. సినిమాల ప‌రంగానే కాకుండా, వ్య‌క్తిగ‌త ప‌రంగా ఆయ‌నంటే ప్రేక్షకాభిమానుల్లో ప్రేమాభిమానాలు ఉంటాయి. తాలా అజిత్ ఒక‌ప‌క్క సినిమాలు చేస్తూ.. మ‌రో ప‌క్క త‌న‌కు ఇష్ట‌మైన బైక్ రైడ్‌, షూటింగ్‌, సైక్లింగ్ వంటి చేస్తుంటాడు. ఈ నేప‌థ్యంలోనే Chennai త‌మిళ‌నాడు స్టేట్ ఛాంపియ‌న్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్ల‌బ్ టీమ్‌కు ప్రాతినిద్యం వ‌హిస్తూ.. అజిత్ పాల్గొని అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచారు. పోటీల్లో భాగంగా ఏకంగా ఆయ‌న టీమ్ ఆరు ప‌త‌కాల‌ను గెలుచుకోగా, అందులో నాలుగు స్వ‌ర్ణ ప‌త‌కాలు. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి..

ajith latest

దీంతో తాలా అజిత్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ల్ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఇక తాలా అజిత్ ప్ర‌స్తుతం వల‌మై అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రానికి హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో.. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా..త్వ‌ర‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.