Chennai: అభిమాని సెల్‌ జేబులో పెట్టుకున్న‌ తాలా అజిత్..

Chennai: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది‌. ఈ నేప‌థ్యంలో సామాన్యుల నుంచి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పోలింగ్ కేంద్రాల దగ్గ‌ర బారులు తీరారు. ఈ క్ర‌మంలో కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ త‌న భార్య షాలినీతో క‌లిసి తిరువాన్మ‌యూర్ పోలింగ్‌కు వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ajith

అయితే ఆయ‌న రాక‌ను గ‌మ‌నించిన ఫ్యాన్స్ ఒక్క‌సారిగా మీద ప‌డుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే ఒక అభిమాని త‌న ఫోన్‌తో ఆయ‌న ముఖం మీద‌కు వ‌చ్చి సెల్ఫీలు తీసుకుంటుండ‌గా.. ఒక్క‌సారి కోపాద్రిక్తుడైన ఆయ‌న ఆ అభిమాని ఫోనును లాక్కొని జేబులో పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది.