అజిత్ ఇంటికి బెదిరింపు కాల్… చేసిందెవరో తెలుసా?

తమిళనాట వరసగా స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో రజినీకాంత్ కి వచ్చిన ఈ బెదిరింపు కాల్, తర్వాత విజయ్ ఇంటికి కూడా వచ్చింది. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అదో సరదాల భావిస్తూ స్టార్ హీరోల ఇళ్లకి బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక కాల్ తల అజిత్ ఇంటికి కూడా వెళ్లింది. తిరువాయున్మియూరులోని అజిత్ ఇంటికి బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు గంటలకు పైగానే తనిఖీలు చేసిన పోలీసులకు అక్కడ ఏం దొరకలేదు. దాంతో మరోసారి అది ఫేక్ కాల్ అని నిర్ణయించుకున్నారు. 2020, జులై 18న అజిత్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి నుంచి ఏకంగా కంట్రోల్‌ రూమ్‌ కే ఫోన్ వచ్చింది. ఈ ఫోన్‌ కాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఇది ఒక ఫేక్ కాల్ అని తేల్చేసిన పోలీసులు ఎవరు చేశారో త్వరలోనే పట్టుకుంటాం అని చెప్పారు. రజినీకాంత్‌కు ఫేక్ కాల్ చేసింది 8వ తరగతి పిల్లాడు.. ఆ తర్వాత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ చేసింది అంగవైకల్యంతో ఉన్నవాడు.. మరిప్పుడు అజిత్ విషయంలో ఎవరు కాల్ చేశారో కనుక్కునే పనిలో పడ్డారు తమిళనాడు పోలీసులు.