అప్డేట్ కోసం తల ఫ్యాన్స్ ట్విట్టర్ నే షేక్ చేశారు

తమిళనాట తల అజిత్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు, ఈ ఏడాది సంక్రాంతికి విశ్వాసం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అజిత్, ఆరు నెలల గ్యాప్ లో నేర్కొండ పార్వై సినిమాతో మరో హిట్ ఇచ్చాడు. హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాని రీమేక్ చేసిన అజిత్, లాయర్ గెటప్ లో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసి రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే అజిత్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కావాలని అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. గత 48 గంటలుగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్న అజిత్ ఫ్యాన్స్, #WeWantTHALA60Updates అనే ట్యాగ్ లైన్ తో ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు.

thala60

తల 59 నెర్కొండ పార్వై సినిమాని నిర్మించిన బోనీ కపూర్ బ్యానర్ లోనే అజిత్ 60 చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. హెచ్. వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ బయటకి రాకపోవడంతో అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ నీ షేక్ చేశారు. ఒక హీరో ఫ్యాన్స్ రెండు రోజులుగా ఈ రేంజులో హంగామా చేయడం ఇదే మొదటిసారెమో, మరి అభిమానుల కోసమైనా అజిత్ నెక్స్ట్ మూవీ డిటైల్స్ చిత్ర యూనిట్ బయట పెడతారో లేదో చూడాలి.