వారికి అండగా అజిత్…

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి తమిళనాడు కోలుకోవట్లేదు. రోజుకి దాదాపు 30 వేళా కేసుల వస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలని కాపాడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తోంది. గవర్నమెంట్ కి అండగా ఉండడానికి సినీ తారలు కూడా ముందుకి వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే సూర్య కార్తీలు సీఎం స్టాలిన్ ని కలిసి కోటి రూపాయలు విరాళం ఇవ్వగా రజినీకాంత్ కూతురు సౌందర్యతో పాటు సీఎం కేర్ ఫండ్ కి కోటి విరాళమిచ్చారు.

డైరెక్టర్ మురుగదాస్, హీరో శివ కార్తికేయన్ లు 25 లక్షలు తమ వంతు సాయంగా ఇచ్చారు. ఈ లిస్ట్ లో తల అజిత్ కూడా చేరారు. ఇదివరకే 25 లక్షలు సీఎం కేర్ ఫండ్ కి ఇచ్చిన అజిత్, మరో 10 లక్షలని సౌత్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని అజిత్ ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించాడు. ప్రజల కోసం ప్రభుత్వం, ప్రభుత్వంకి అండగా సినీ తారలు. కష్టాన్ని అందరూ కలిసి ఎదురుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.