Ajith: హైద‌రాబాద్‌లో సైక్లింగ్ చేస్తున్న తాలా అజిత్‌..

Ajith: కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు.. ఆయ‌నంటే త‌మిళ్ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఇష్టం.. ఆయ‌న న‌టించిన సినిమాల‌కు సినీ ప్రేక్ష‌కుల నుంచి ఎంతాగానో రెస్పాన్స్ వ‌స్తుంది. ఆయ‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇక ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యానికొస్తే.. అజిత్ అమితంగా ఇష్ట‌ప‌డే విష‌యం..బైక్ రేసింగ్ అంటే ఆయ‌నకు ఎంతో ఇష్టం.. అలాగే రైఫిల్ షూటింగ్‌, పైల‌ట్‌, కుకింగ్ ఇలా ఆయ‌న‌కు చాలా అభిరుచులు ఉన్నాయి. ఇటీవ‌లే Ajithఅజిత్ బైక్ మీద ఏకంగా 10వేల కిలోమీట‌ర్లు తిరిగేసి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల‌ను చుట్టేసి వ‌చ్చాడు అజిత్‌.

Ajith cycling

ఇక తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో సైక్లింగ్ చేశాడు. అజిత్ న‌టిస్తున్న తాజా చిత్రం వాలిమై. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీఫిలిం సిటీలో జ‌రుగుతుంది. అయితే షూటింగ్‌లో కొంత విరామం దొర‌క‌డంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహిదీప‌ట్నం వ‌ర‌కు.. తిరిగా ఆరాంఘ‌ర్ చౌర‌స్తా మీదుగా రామోజీ ఫిలింసిటీ వ‌ర‌కు సైక్లింగ్ చేశాడు Ajithఅజిత్‌.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక వాలిమై చిత్రానికి వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ప్ర‌స్తుతం ఈ Ajithచిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.