ప్రెస్ నోట్ తేదీ : 05-11-2022
ఇందు మూలంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేయునది ఏమనగా ప్రముఖ దర్శకులు శ్రీ. కె. విశ్వనాధ్ గారికి మరియు ప్రముఖ ఆర్టిస్ట్ దర్శక – నిర్మాత శ్రీ. ఆర్. నారాయణ మూర్తి గారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారికి వై. యస్. ఆర్. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హర్షం వ్యక్త పరుస్తూ వారికీ అభినందలు తెలియజేయడం జరిగింది.
దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ తెలుగు సినిమాలు శంకరాభరణం, సాగరసంఘం, చెల్లెలికాపురం, కాలంమారింది , శారద, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించగా ప్రముఖ ఆర్టిస్ట్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీ ఆర్. నారాయణమూర్తి నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ఎర్రసైన్యం, దండోరా, చీమలదండు, లాల్ సలాం, వీరతెలంగాణ, స్వతంత్రం, మొదలైన చిత్రాలు స్ఫూర్తిదాయకమైన హిట్లు గా నిలిచి మరియు అందరిచే ప్రశంసలు పొందాయి.
ఈ సందర్భంగా, అవార్డు గ్రహీతలు లెజెండ్రీ డైరెక్టర్ శ్రీ కె. విశ్వనాథ్ గారికి మరియు ప్రముఖ ఆర్టిస్ట్, డైరెక్టర్ మరియు నిర్మాత శ్రీ ఆర్ నారాయణ మూర్తి గారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.
ఈ సందర్బంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
టి. ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి