TFPC ప్రెస్ నోట్ తేదీ : 06-08-2022

ఇందుమూలంగా తెలియజేయడము ఏమనగా 05-08-2022 రిలీజ్ అయిన “బింబిసార” మరియు “ సీతారామమ్“ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ఆదరణతో బ్రహాండమైన విజయాన్ని పొందగలిగాయి. “బింబిసార” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది.. ఈ చిత్రం నిర్మాత మరియు హీరో అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గారు “బింబిసార” పాత్రలో అద్భుతమైన నటనను చూసి ప్రేక్షకులు ఆనందోత్సవాల్లో తేలిపోతున్నారు. ముఖ్యముగా కరోనా మూలంగా ప్రేక్షకులు థియేటర్లకు రాని సమయంలో తెలుగు చిత్రం ” అఖండ ” ప్రేక్షకులను థియేటర్ల కు రప్పించి గలిగింది. ప్రస్తుతము సినిమా పరిశ్రమ అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో ప్రేక్షకులు థియేటర్ కు రావడం కష్టతరం అయినది. ఇటువంటి సమయంలో “బింబిసార” సినిమా ప్రేక్షకుణ్ణి థియేటర్ కు రప్పించగలిగింది. థియేటర్ల వద్ద ఒక పండుగ వాతావరణం నెలకొనివుంది.


ఇంతకుముందు “నందమూరి తారక రామారావు ఆర్ట్స్” బ్యానర్ పై పరిచయం అయిన కొత్త డైరెక్టర్లు శ్రీ. సురేందర్ రెడ్డి మరియు శ్రీ అనిల్ రావిపూడి వీరు ప్రస్తుతం లీడింగ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ” బింబిసార ” సినిమా విజయంతో కొత్త డైరక్టర్ అయిన ” శ్రీ వశిష్ఠ ” ప్రముఖ డైరక్టర్ల లిస్ట్ లో చేరిపోయారు.అలాగే ఈ రోజు “వైజయంతీ మూవీస్” బ్యానర్ లో గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని ” మహానటి ” “జాతిరత్నాలు”తో అఖండ విజయాలను అందుకుని నేడు విడుదలైన చిత్రం ” సీతారామమ్ ” విజయపథంలో దూసుకుని పోతూంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది నిర్మాతలు వైజయంతి మూవీస్ అధినేతలు శ్రీ అశ్వనీదత్ గారు, స్వప్న దత్ గారు, శేషు ప్రియాంక దత్ గారు, దర్శకులు శ్రీ హను రాఘవ పూడి గార్లకు క్లాసిక్ చిత్రంగా మంచి పేరు తీసుకొనివచ్చింది. ప్రస్తుత సినిమా పరిశ్రమ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు “ఆక్సిజన్” అందించినట్టుగా అందరు భావిస్తున్నారు.
కాబట్టి “తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి” తరపున పై రెండు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు మరియు సాంకేతిక నిపుణులకు, ఇంత ఘనవిజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి
టి. ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల