కరోనా కష్టకాలంలో మంచి వసూళ్లను అందుకున్న ‘టెనెట్’ మూవీ!!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పాండమిక్ పరిస్థితిలో గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాలీవుడ్ మూవీ టెనెట్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు ఇతర హాలీవుడ్ హీరోలు కూడా ప్రమోషన్స్ లో భాగంగా కొంత సహాయం చేశారు. టామ్ క్రూజ్ థియేటర్ లో సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు.

ఇక ప్రపంచంలోని 41దేశాల్లో విడుదలైన టెనెట్ ఫస్ట్ వీకెండ్ లో 53మిలియన్ డాలర్లను అందుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 387కోట్ల రూపాయలు. పరిస్థితులు అనుకూలిస్తే మిగతా దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇండియాలో కూడా టెనెట్ సినిమాను సౌత్, నార్త్ మెయిన్ భాషలలో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. బహుశా థియేటర్స్ ఓపెన్ అయితే అక్టోబర్ లోనే మన దగ్గర విడుదల కావచ్చు. మరి ఈ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో లాభాలను అందుకుంటుందో చూడాలి.