తెలుగు ‘టీవీ సీరియల్’ నటి ‘శ్రావణి’ ఆత్మహత్య..

మనసు మమత, మౌనరగం వంటి సీరియల్స్ ద్వారా క్రేజ్ అందుకున్న నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. గతకొంత కాలంగా ఒక వ్యక్తి ఆమెనే వేధింపులకు గురి చేయడం వల్ల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ మధునగర్‌లోని నివాసం ఉంటున్న శ్రావణి గత 8 ఏళ్లుగా నటిగా కొనసాగుతోంది.

ఇక గత ఏడాది టిక్ టాక్ ద్వారా ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. శ్రావణిని డబ్బులు ఇవ్వమంటూ ఆతను వివిధ రకాలుగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి బాత్రూమ్ లోకి వెళ్లిన శ్రావణి ఎంత సేపటికి బయటకు రాకపోవడంటజో కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్దారించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించి టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఆ యువకుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధమయ్యాడాని, డబ్బులు కూడా డిమాండ్‌ చేసినట్లు బంధువులు ఆరోపించారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే శ్రావణి ఆత్మహత్యకు చేసుకున్నట్లు వారు తెలిపారు.