రామోజీ రావు గారి మరణం కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బంద్

మీడియా దిగ్గజం, ప్రముఖ పరిశ్రేమక వేత్త, నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం సుమారు 4:45 గంటలకు మరణించడం జరిగింది. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటుగా మిగిలిపోతుంది. ఆయన తన వ్యాపార సంస్థల వేళా మందికి ఉపాధిని అందించారు. అంతే కాకుండా ప్రియ ఫుడ్స్ ధ్వారా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు మన తెలుగింటి ఫుడ్స్ అందేలా చేసారు. ఈ ఉష కిరణాలూ అనే మాట వినని తెలుగు వారు ఉండరు. ఆ నిర్మాత సంస్థకు అధినేత రెమిజి రావు గారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ ద్వారా సినీ ఇండస్ట్రీ కి ఎంతో సహాయం చేసారు. ఆయన మరణానంతరం ఆయన మరణానికి గౌరవంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి ప్రెస్ నోట్ విడుదల చేసారు. రేపు ఇరు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్ర, తెలంగాణాలలో ఎటువంటి సినిమా పనులు జరగవు అని సెలవు ప్రకటించారు. షూటింగ్స్ సైతం నిలిపివేశారు.