తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములు, విధివిధానములు 01-07-2022 నుండి 30/06/2025

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, గౌరవ కార్యదర్శి శ్రీ K.L. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ. C.కళ్యాణ్, గౌరవ కార్యదర్శి శ్రీ. T. ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి శ్రీ కె. అనుపమ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ. వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ శ్రీ. P.S.N. దొర, కోశాధికారి సురేష్ లు పాల్గొన్న సమావేశములులో వేతనములు, విధివిధానములు అన్నియు ఖరారు అయినాయని, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరములో చేసిన ఒప్పందంను అనుసరించి ఆ వేతనముల మీద పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరించడమైనదని, ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీనుండి 30-06-2025 వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి

(K. బసిరెడ్డి) (K.L. దామోదర్ ప్రసాద్) (C. కళ్యాణ్) (T. ప్రసన్న కుమార్)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి అధ్యక్షులు గౌరవ కార్యదర్శి
తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్

(సునీల్ నారంగ్) (K. అనుపమ్ రెడ్డి) (వల్లభనేని అనిల్ కుమార్) (P.S.N. దొర)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి అధ్యక్షులు గౌరవ కార్యదర్శి