Allu Ramesh: అల్లు రమేష్ ఇక లేరు..

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు రమేశ్ (Allu Ramesh) కన్నుమూశారు. ఆయన మృతితో వైజాగ్ సినీ రంగం ఒక మంచి నటుడ్ని కోల్పోయిందని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. అలానే ‘మా విడాకులు’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆయన యాక్ట్ చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ కు చెందిన అల్లు రమేష్ తొలుత నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోయినప్పటికీ.. తనదైన కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రసారమవుతున్న ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ లో మామగా నటిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చూసేవారికి.. ఈ సిరీస్ గురించి, అందులో కామెడీతో నవ్విస్తున్న రమేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆయన ఇప్పుడు సడన్ గా చనిపోవడంతో అందరూ బాధపడుతున్నారు. మీ తరఫున సంతాపాన్ని వీలైతే కింద కామెంట్ పెట్టి తెలియజేయండి.