ఘనంగా తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు!!

నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో జె.వి.మోహన్ గౌడ్, పి.విజయ వర్మ , RVN వరప్రసాద్, మిత్తాన ఈశ్వర్ రావు నిర్వహణలో 6-2-23వ తేదీ తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిధులుగా హాజరైన సినీ ప్రముఖులు యం. మురళీ మోహన్, ఆలీ, తెలంగాణ FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి, సుఖీభవ ప్రాపర్టీస్ CMD అత్తారి గురురాజ్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ అనుపమ్ రెడ్డి చేతులమీదుగా అందరూ సీనియర్స్ కు అవార్డ్స్ అందజేయడం జరిగినది. అవార్డ్ గ్రహీతలలో… 2022 జాతీయ అవార్డ్ విన్నర్స్ కలర్ ఫోటో టీమ్, బెస్ట్ కోరియోగ్రఫీ సంధ్యా రాజు, బెస్ట్ మేకప్ రాంబాబులతోపాటు సీనియర్ ఆర్టిస్ట్స్ శివకృష్ణ, నరసింహరాజు, సంగీత, అన్నపూర్ణమ్మ, నిర్మాతలు కెవివి సత్యనారాయణ, కాకర్ల కృష్ణ, దర్శకులు ధవళ సత్యం, పి.సాంబశివరావు, ఎగ్జిబిటర్స్ నందగోపాల్, లక్ష్మి నరసింహం, డిస్ట్రిబ్యూటర్స్ డి.రామాచారి, వి.జనార్ధన్ రావు, స్టూడియో విభాగంలో సారథి స్టూడియోస్, సేవ విభాగంలో యన్.గోపాల్ కృష్ణ, జర్నలిస్ట్ కె.ఉమామహేశ్వర రావు, రైటర్ తోటపల్లి సాయినాథ్, కెమెరామెన్ యం.వి.రఘు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, మేకప్ మాధవరావు, సౌండ్ ఇంజనీర్ కొల్లి రామకృష్ణ,.ఫైట్ మాస్టర్ కె.విజయ కుమార్, మేనేజర్ ధవళ చిన్నారావు, ఆర్ట్ డైరెక్టర్ రామచంద్ర సింగ్, కాస్ట్యూమర్ దొనేపుడి నాగేశ్వరావు, కొరియోగ్రాఫర్ జోసెఫ్ ప్రకాష్, డబ్బింగ్ శ్రీవల్లి, తబలిస్ట్ ప్రభాకర్, పబ్లిసిటీ డిజైనర్ రమణ, డైలాగ్ ఆర్టిస్ట్ వీరమాచినేని ప్రసాద్, స్టిల్ ఫోటోగ్రాఫర్ కృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్ బి.నారాయణ, కెమెరా అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, లైట్ మెన్ యం.జైపాల్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ బి.నరసింహారెడ్డి, స్టూడియో వర్కర్ మోగేష్, డ్రైవర్ రవి, మహిళా వర్కర్ రంగమ్మ, జూనియర్ ఆర్టిస్ట్స్ సంగీత రావు, గుండ్ల అనసూయ ఉన్నారు!!