డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించిన బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశ పరీక్షకు సుప్రసిద్ధ క్యారెక్టర్ నటి హేమా ఆదివారం హాజరయ్యారు. ఆమె పరీక్ష రాయడానికి నల్గొండ పట్టణానికి వెళ్ళింది. హేమ 7వ తరగతి వారకె తన విద్యాభ్యాసంకు బ్రేక్ ఇచ్చిందట. సినిమాలో నటిగా తెలుగు చిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత హేమ చాలా బిజీగా మారింది. అందుకే చదువుకు దూరమయ్యింది.
ఇక ఫైనల్ గా తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడానికి ఇప్పుడు సిద్ధమైంది. ప్రస్తుతం హేమ వయసు 53 ఏళ్ళు. దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు నటి చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. సరైన విద్య అర్హతలు లేదా ధృవపత్రాలు లేని విద్యార్థులకు ఓపెన్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీకి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో సాదారణ విద్యార్థిలా హేమ కూడా పరీక్షకు హాజరయ్యింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక 2014లో అసెంబ్లీ ఎన్నికలలో మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగిన హేమ విజయం సాధించలేకపోయింది.