ఎన్టీఆర్ చరణ్ పోస్టర్ కి ట్రాఫిక్ పోలిస్ ట్విస్ట్…

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్‌. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ నుంచి బయటకి వచ్చి చిత్ర యూనిట్, ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ నుంచి చరణ్ అండ్ ఎన్టీఆర్ బైక్ మీద ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ట్విట్టర్ అండ్ ఇన్స్టాని రామరాజు టీమ్‌ భీమ్ లు ఉన్న ఫోటో కదిపెసింది. టాప్ ట్రెండ్ లోకి వచ్చిన ఈ ఫోటోకి తెలంగాణ ట్రాఫిక్ పోలిస్ ఫైనల్ టచ్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ కి ట్రాఫిక్ పోలిస్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ట్రాఫిక్ రూల్స్ ని చెప్పడానికి ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ ఫాలో అయ్యే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు… ఈ పోస్టర్‌ని తమదైన శైలీలో ఎడిట్ చేశారు. బైక్‌పై ఉన్న ఎన్టీఆర్‌, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ ట్వీట్‌ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీగా రెస్పాండ్ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కూడా ‘ఇప్పటికీ అది పరిపూర్ణంగా లేదు. నెంబర్‌ ప్లేట్‌ మిస్సయింది’ అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టింది. ఈ వ్యవహారమంతా ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది.