చిరంజీవి ఇంటికి మంత్రి.. రాజకీయంగా ఉత్కంఠ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టించింది. అయితే సినిమాలతో పాటు త్వరలో రాజకీయంగా కూడా చిరు మళ్లీ క్రియాశీలకం కావాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనకు అండగా ఉంటానంటూ చిరంజీవి చెప్పారంటూ ఇటీవల జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

etela rajender meet chiranjevi

అయితే తాజాగా చిరంజీవిని టీఆర్‌ఎస్ కీలక నేత, మంత్రి ఈటెల రాజేందర్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరికొందరు నేతలతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లిన రాజేందర్.. చిరుతో ఏకాంతంగా మాట్లాడారు. సీఎం మార్పుపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో.. చిరుతో ఈటెల భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు ఆ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.