

పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటి పూనమ్ కౌర్, డిజిటల్ వేదికగానూ ఓ వినూత్న కార్యక్రమంతో అలరించానికి సిద్ధమవుతున్నారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’ పేరుతో ప్రసారం కానున్న కార్యక్రమానికి పూనమ్ కౌర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. స్త్రీ శక్తిని, భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ.. ఈ తరంలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం.

‘శక్తి ఔర్ సంస్కృతి’ లాంటి గొప్ప కార్యక్రమానికి పూనమ్ కౌర్ శ్రీకారం చుట్టడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందనలు తెలిపారు. బుధవారం జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ‘శక్తి ఔర్ సంస్కృతి’ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పించడం, సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’ లాంటి కార్యక్రమాలు అందుకు దోహదపడతాయని జిష్ణుదేవ్ వర్మ అన్నారు.