Tollywood: జాంబీరెడ్డి ప్రీరిలీజ్ వేడుక‌ల్లో వ‌రుణ్ నుంచి మైక్ లాక్కొని మాట్లాడిన తేజ..

Tollywood: తేజ స‌జ్జా టాలీవుడ్‌లో బాల‌న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో న‌టించి ప్ర‌స్తుతం హీరోగా మారిన‌ చిత్రం జాంబీరెడ్డి. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై రాజ్ శేఖ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నెల ఫిబ్ర‌వ‌రి 5న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

varuntej-Teja

Tollywood ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ మాట్లాడుతూ.. బాల‌న‌టుడిగా తేజ చేస్తున్న స‌మ‌యంలోనే నాకు తెలుసు. చిరంజీవి గారి ఇంటికి వ‌చ్చి అంద‌రితో మాట్లాడేవాడని.. అప్ప‌టినుంచే తేజ‌తో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని చెప్పారు వ‌రుణ్. జాంబీరెడ్డి లాంటి వైవిధ్య‌మైన చిత్రంతో తేజ హీరోగా ప‌రిచ‌యం కావ‌డం అంత సుల‌భం కాద‌ని, ఈ విష‌యంలో తేజ‌ను అభినందిస్తున్నాన‌ని వ‌రుణ్ పేర్కొన్నారు. అయితే వ‌రుణ్ మాట్లాడుతుండ‌గా.. మైక్ తీసుకున్న తేజ ఓ విష‌యం చెప్పాడు. స‌డెన్‌గా నాకొక విష‌యం గుర్తొచ్చింది. Tollywood ఐదేళ్ల క్రితం వ‌రుణ్ అన్న‌ను క‌లిశాను. ఏం చేస్తున్నావురా అని అడిగారు. సినిమాల్లో ట్రై చేస్తున్నా అన్న అని చెప్పాను. నీకు పాతికేళ్లు వ‌చ్చేంత వ‌ర‌కు క‌ష్టం.. కుద‌రదు అన్నారు. దీంతో నిజంగానే నాకు పాతికేళ్లు వ‌చ్చిన త‌ర్వాత జాంబీరెడ్డి చిత్రంతో హీరోగా చేస్తున్నాన‌ని తెలిపాడు తేజ స‌జ్జా. ఇక ఈ కార్య‌క్ర‌మానికి డైరెక్ట‌ర్లు బాబీ, త‌రుణ్ భాస్క‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ శ్రీ‌ను పాల్గొన్నారు. జాంబీరెడ్డి చిత్రంలో తేజ స‌జ్జా స‌ర‌స‌న ఆనంది ద‌క్ష హీరోయిన్‌గా న‌టిస్తుంది.. కాగా ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ స్వ‌రాలు అందిస్తున్నారు Tollywood.