AR REHAMAN: ఆయ‌నంటే విప‌రీత‌మైన అభిమానం.. ఏఆర్ రెహ‌మాన్‌తో టీంఇండియా క్రికెట‌ర్‌!

AR REHAMAN: ఇటీవ‌లే గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీమిండియా త‌ర‌పున వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆల్‌రౌండ‌ర్ ప్ర‌తిభ‌తో క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆస్ట్రేలియాపై జ‌రిగిన తొలి ఇన్నింగ్స్‌లో 62ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22ప‌రుగులు, నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అలాగే బౌలింగ్‌లో కూడా 4వికెట్లు తీసి సుంద‌ర్ ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

sunder meets ar rehaman

అయితే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత స్వ‌దేశానికి వ‌చ్చిన సుంద‌ర్ బుధ‌వారం చెన్నైలోని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు AR REHAMAN ఏ.ఆర్‌.రెహ‌మాన్ నివాసంలో క‌లిసి త‌న‌తో ఫోటోలు దిగాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ… నేను ఎంతో ఇష్ట‌ప‌డే AR REHAMAN రెహ‌మాన్‌ను స్వ‌యంగా క‌లిశాను.. ఇది నిజంగా ఆనంద‌కార‌మైన సాయంత్రం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. చిన్న‌ప్ప‌టి నుంచి ఏఆర్ రెహ‌మాన్ పాటలు వింటూ ఉండేవాడిన‌ని, AR REHAMAN త‌నంటే విప‌రీత‌మైన అభిమాన‌ని ఈ సంద‌ర్భంగా సుంద‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.