


కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్ చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్ తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ” మా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా ధన్యవాదాలు. పెళ్లి చూపుల కోసమని ఓ గ్రామానికి వెళ్లిన హీరో, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ పరిణామాల మధ్యలో అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఉంటుంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ” ఈతరం ప్రేక్షకులకు కావాలసిన అంశాలతో పాటు సినిమా చూసేటప్పుడు ఉండే ఉత్కంఠ ఈ చిత్రంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. మా పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా థ్యాంక్స్ చెబుతున్నాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భరత్ రోంగలి
ఎడిటర్: విప్లవ్ నైషదం
కెమెరా: భరత్ పట్టి
డిఐ: భూషణ్
దర్శకుడు: అర్జున్ కోల
నిర్మాత: వంశీ సీమకుర్తి