20 ఏళ్ళ నువ్వే కావాలి.. నాకు ఆరో ప్రాణం: కొరియోగ్రాఫర్ సూచిత్ర

తరుణ్, రిచా పల్లోద్ జంటగా నటించిన నువ్వే కావాలి సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ సినిమా అందించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని జ్ఞాపకాలను ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. ఇక ఆ సినిమాలో అన్ని పాటలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా సూచిత్ర వర్క్ చేశారు. ఆమెకు పెళ్లి తరువాత వచ్చిన మొదటి అవకాశం అదే.

పెళ్లి చేసుకున్నాక ఒక్క ఆఫర్ కూడా రాకపోవడంతో ప్రతి రోజు ఫోన్ మొగితే తన కోసమే చేశారేమో అని ఫోన్ వద్దకు పరుగులు తీసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయట. ఇక దర్శకుడు విజయ్ భాస్కర్ కి ఎప్పటికి రుణపడి ఉంటానని ఆ సినిమా తనకు ఆరో ప్రాణం లాంటిదని చెప్పిన సూచిత్ర ఆ ఆఫర్ కోసం కాల్ చేయగానే ఎంతగానో సంతోషించారట. కేవలం నాకు స్వేచ్ఛను ఇవ్వండి.. నా టాలెంట్ ఏమిటో నిరూపిస్తాను అని ఆమె చాలా తక్కువ సమయంలో సాంగ్స్ కి డ్యాన్స్ కంపోజింగ్ చేశారు. అనగనగా ఆకాశం ఉంది.. పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తుండగా జనాలను అక్కడకు పిలిచి వారికి తెలియకుండానే షూట్ చేశామని సూచిత్ర వివరణ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది నేటితరం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా సంగీతం అందించింది కోటి.