రాజ్య‌స‌భ‌కు ప్రముఖ సినీ రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌

ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి మరి తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓక ముద్ర వేశాయని ప్రశింసించారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలిపారు ప్రధాని .‘శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.