రిలీజ్ డేట్ మీకు మాత్రమే చెప్తా…

బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, నిర్మాతగా మారి ఒక సినిమా చేస్తున్నాడు. పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంత్ గా ఈ సినిమా టీజర్ కూడా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామిక్ టైమింగ్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమాని చిత్ర యూనిట్, నవంబర్ 1న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారని చెప్పాడు. ఇంకా, యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు. అభినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు.