నందమూరి తారక రత్న సార‌థి మోష‌న్‌పోస్ట‌ర్ కి విశేష స్పంద‌న‌

నందమూరి తారక రత్న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సార‌థి మోష‌న్‌పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన రావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. “ఎక్కువ పోటీ ఉన్నప్పటికీ, ‘సారధి’ మోషన్ పోస్టర్‌కు చాలా ప్రశంసలు వచ్చాయి. మహమ్మారి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారక రత్న గారికి ధన్యవాదాలు. టీమ్ మొత్తం సహకారంతో, మేము విజయం సాధించాము. ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తున్నాం’’ అని దర్శకుడు జకట రమేష్‌ తెలిపారు.

నిర్మాతలు పి నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావులు మాట్లాడుతూ.. ఖో ఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సిద్ధార్థ్ వాటికన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు“ అన్నారు.

నందమూరి తారక రత్న మరియు వైశాలి రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు,మారుతీ సాకారం రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ తదితరులు తారాగణం.

మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీతం సిద్ధార్థ వాటికన్. స్టంట్స్ కృష్ణ మాస్టర్. ఎడిటింగ్ విజన్ స్టూడియో.డిజిటల్ మానోజ్ తాడి
పిఆర్ఓ: మ‌ధు వీఆర్‌