బికినీ ఎప్పటికీ వేసుకోనంటున్న హీరోయిన్

టాలీవుడ్‌లో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది తాప్సి. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా బాగానే గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో ఇక బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది.

TAPSEE PANNU BIKINI
TAPSEE PANNU BIKINI

ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే తాప్సి.. గతంలో రాఘవేంద్రరావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనకు బొడ్డు మీద పళ్ళతో కొట్టడం సరదా అంటూ తాప్సి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై తాప్సి క్షమాపణలు చెప్పింది. ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది.

అయితే తాజాగా ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో బికినీ వేసేది లేదని చెబుతోంది. సోషల్ మీడియాతో కూడా తన బికినీ ఫొటోలు ఇకపై రావని చెప్పింది. ఇక నుంచి బికినీ అందాలన్నీ కేవలం ఆఫ్ స్క్రీన్‌కు మాత్రమే పరిమితమని తాప్సీ తెలిపింది. చిట్టిపొట్టి దుస్తుల్లో తనను అభిమానులు ఊహించుకోలేరని, తాను ఇప్పుటివరకు జుద్వాలో తప్ప ఇక ఏ సినిమాలో కూడా బికినీలో కనిపించలేదని చెప్పింది.