బాలయ్యతో సినిమా చేస్తే బరువు పెరుగుతారు

టాలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణతో కలిసి నటించే ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు. బాలయ్యతో నటించాలనే కల ప్రతిఒక్క హీరోయిన్‌కు ఉంటుంది. బాలయ్యతో నటిస్తే క్రేజ్ వస్తుందని హీరోయిన్స్ భావిస్తారు. అంతేకాకుండా బాలయ్య షూటింగ్స్‌లలో సరదాగా ఉంటూ హీరోయిన్స్‌ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. అప్పట్లో బాలయ్య హీరోగా వచ్చిన ‘వీరభద్ర’ సినిమాలో నటించింది తను శ్రీ దత్తా. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమా అనుభవాలను మరోసారి పంచుకుంది.

tanushree dutta BALAYYA

బాలయ్యతో ఏ హీరోయిన్ సినిమా చేసినా బరువు పెరగడం ఖాయమని చెబుతోంది. వీరభద్ర సినిమా చేసేటప్పుడు 5 కేజీల బరువు పెరిగానని, ఆ సినిమా సమయంలో బాలయ్య తనను బాగా చూసుకున్నారని చెప్పింది. సినిమా యూనిట్ కూడా తనకు బాగా చూసుకుందని, ఎన్నో రకాల వంటకాలు టేస్ట్ చేశానని చెప్పింది. బాగా తినేసరికి షూటింగ్ అయిపోయేసరికి 5 కిలోల బరువు పెరిగానంది.

పెరిగిన బరువును తల్లిదండ్రులకు చూపించి టాలీవుడ్‌లో హీరోయిన్స్‌ను ఇంత బాగా చూసుకుంటారని చెప్పానంది. బాలయ్య హీరోయిన్స్‌తో చాలా సరదాగా ఉంటారని చెప్పింది. వీరభద్ర సినిమా తర్వాత తెలుగులో ఈ భామకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ కొన్ని సినిమాల్లో నటించినా పేరు రాలేదు. సీనియర్ నటుడు నానా పటేకర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో ఒక్కసారి ఈ భామ పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది.