అల్లు అర్జున్ పుష్పలో మరో స్టార్ హీరో

స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అందాల బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఒక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో బన్నీ-సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. వారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

simbu in pushpa movie

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటించనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంతకముందు ఆ పాత్ర కోసం హీరో విక్రమ్, బాబీ సింహా, సముద్రఖని, మాధవన్, ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.