కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరినీ కరోనా భయపెడుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి పలువురు సినీ ప్రముఖులు మృతి చెందగా.. మరికొంతమంది కోలుకుని సేఫ్‌గా బయపటడ్డారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి పలువురు సినీ ప్రముఖులు కరోనాతో మృతి చెందడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురి అయింది.

K BALU PASSES AWAMY
K BALU PASSES AWAMY

తాజాగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కె.బాలు మృతి చెందారు. గత నెలలో అనారోగ్యంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన చేరారు. అనంతరం టెస్టు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కొద్దిరోజులుగా కె.బాలు కరోనా చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆరోగ్యం మరింత విషమించడంతో మరణించారు. ఇవాళ చెన్నైలోని తన నివాసంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

కేబి ఫిలిమ్స్ బ్యానర్‌పై కోలీవుడ్‌లో ఆయన చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఇప్పటివరకు 15కి పైగా సినిమాలను ఆయన నిర్మించారు. కె.బాలు మృతికి పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.