‘బాలసుబ్రహ్మణ్యం’కి స్టార్ హీరో ‘విజయ్’ కన్నీటి వీడ్కోలు!!

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నై లోని ఆయన ఫామ్ హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాల మధ్య జరుగుతున్నాయి. అయితే కడసారి బాలును చూసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ఇక అంత్యక్రియలు జరుగుతున్న చివరి క్షణంలో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా బాలును చూసేందుకు వచ్చారు.

బాలు భౌతికకాయాన్ని చూసి విజయ్ కంటతడి పెట్టారు. భావోద్వేగానికి లోనై కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తో మాట్లాడిన విజయ్ అతనికి ధైర్యం చేశారు. ఇక ఫాంహౌస్ వద్దకు అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో ఫాంహౌస్ లోకి అభిమానులను పోలీసులు అనుమతించడం లేదు.