తమన్నా… డాన్సులో సరిలేరు నీకెవ్వరు…

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మరోసారి తమన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మహేశ్ ని మేజర్ అజయ్ పాత్రలో చూపించనున్న అనీల్ రావిపూడి, సూపర్ స్టార్ రేంజుకి సెట్ అయ్యే ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేశాడట. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయేలా కంపోజ్ చేసిన సాంగ్ కి ఎవరైనా స్టార్ హీరోయిన్ తో స్పెషల్ అప్పీరెన్స్ ఇప్పిస్తే బాగుంటుందని ఆలోచించిన అనీల్ రావిపూడి, అందుకు మిల్కీ బ్యూటీ తమన్నాని ఫైనల్ చేశాడని సమాచారం. తమన్నా కూడా మహేశ్ పక్కన స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ కావడంతో, ఆగడు కాంబినేషన్ ని త్వరలో మళ్లీ చూడబోతున్నామని ఘట్టమనేని అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.

మంచి డాన్సర్ అయిన తమన్న, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో చేయబోయే సాంగ్ చాలా బాగుంటుందని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది, ఈ షెడ్యూల్ అయ్యే లోపు స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి చేయాలని అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట.