
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్ సంపత్ నంది విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఓదెల 2 ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది?
-పార్ట్ వన్ చేసినప్పుడు సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. ఏదైనా అవకాశం ఉంటే చేయొచ్చు కదా అని చివర్లో ఒక లీడ్ ఇచ్చాం. పార్ట్ వన్ తెలుగులో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆహ వారు తమిళ్ రేట్స్ కూడా కొనుక్కున్నారు. దీన్ని హిందీలో రీమేక్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. డైరెక్టర్ అశోక్ ఈ సినిమాకి సీక్వెల్ ఎందుకు రాయకూడదు అని అడిగారు. ఒకసారి భీమ్స్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్లాను. అప్పుడు ఆ మ్యూజిక్ సిటింగ్స్ అవ్వలేదు కానీ ఈ సీక్వెల్ ఆలోచన అక్కడే క్రియేట్ అయింది.
-ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్ చేసిన రాధ క్యారెక్టర్ హైలెట్ అయింది. సెకండ్ పార్ట్ లో కూడా ఒక ఫిమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఫస్ట్ పార్ట్ లో ఒక దుష్ట శక్తిని అంతం అవుతుంది. దాని ఆత్మని కంట్రోల్ చేయాలంటే మరో శక్తి కావాలి. శివశక్తి లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన పుట్టింది. తమన్నా గారితో ఇంతకుముందే రెండు సినిమాలు పనిచేశాను. తను చాలా మంచి పెర్ఫార్మర్ ఈ క్యారెక్టర్ కి తను యాప్ట్ ఉంటుందని చెప్పాను. తనకి కూడా చాలా నచ్చింది.
-ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్. ఆత్మ వర్సెస్ పరమాత్మ. నేను శివశక్తి లాంటి క్యారెక్టర్లు మా ఊరి ప్రాంతాల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూశాను. మా నాన్నమ్మ శివశక్తిగా ఉండేవారు. చిన్నప్పుడు తనకి పూనకం రావడం నేను చూశాను. తెలిసి తెలియని వయసులో కామెడీ కూడా చేసుకునే వాళ్ళం. నానమ్మ ఆ చుట్టుపక్కల చాలా పాపులర్. ఎవరికైనా కష్టం వస్తే వచ్చి చెప్పుకునే వాళ్ళు. ఆ విజువల్స్ అన్ని నాకు గుర్తున్నాయి. అది స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని భావించాను. శివశక్తులు నాగసాధువులుగా మారతారని శివాలయాలను పునరుద్ధరణ చేస్తారని ఇలా చాలా సమాచారం తెలిసింది. అలా నాగసాధు క్యారెక్టర్ పుట్టింది.
అజినీస్ లోక్ నాథ్ మ్యూజిక్ గురించి?
-ఈ కథ అనుకున్న వెంటనే ఫైనల్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ అజినిష్. దానికి కారణం కాంతార. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అజినీస్ మ్యూజిక్.
డైరెక్టర్ అశోక్ గురించి ?
-అశోక్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన్ని డైరెక్టర్ చేయాలనే ఓదెల సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా తీశాడు.
హెబ్బా పటేల్ గారి క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటుంది?
-సెకండ్ పార్ట్ లో హెబ్బా క్యారెక్టర్ ఉంది. సెకండ్ హాఫ్ లో చాలా పెద్ద ఎపిసోడ్ చాలా క్రూషియల్ గా ఉంటుంది.

ఇలాంటి కథ రాయాలని ఆలోచన మీకు ఎప్పటినుంచి ఉంది?
-ఇలాంటి కథ రాస్తానని నేను అనుకోలేదు. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద ఇలాంటి కథలు చేసుకుంటూ వెళుతున్నాను రెండు మూడేళ్ల క్రితం నాకు ఇంత అవగాహన కూడా లేదు. నా వైఫ్ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని ఎనిమిది ఏళ్ళు అవుతుంది. తను ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది. కొన్ని పుస్తకాలు కూడా చదివాను. అవన్నీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్నాయేమో ఈ సినిమా రూపంలో బయటికి వచ్చాయి.
వశిష్ట సింహ గురించి?
వశిష్ట వాయిస్ చాలా బాగుంటుంది. పార్ట్ వన్ లో ఆయన వాయిస్ వినే క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పమని చెప్పాను. ఈ సినిమాలో కూడా తన పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ప్రొడ్యూసర్ మధు గారి గురించి?
ఆయన చాలా పాషన్ వున్న నిర్మాత. ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు నచ్చితే వెంటనే చేస్తాం అని అంటారు. ఈ సినిమాని కాశీలో లాంచ్ చేద్దామని చెప్పాను. మరో ఆలోచన లేకుండా ఖర్చు గురించి ఆలోచించకుండా లాంచ్ చేశారు. అలాగే కుంభమేళాలో టీజర్ లాంచ్ చేయడం ఆయన ఫ్యాషన్ తోనే సాధ్యపడింది. ఒక సంకల్ప బలంతో ఈ సినిమా చేయడం జరిగింది.
తమన్నా గారి నాగసాధు లుక్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు?
-మొదట మూడు లుక్స్ ట్రై చేసాం. తమన్నా గారు చాలా ఫెయిర్ గా ఉంటారు. నాగ సాధులు ఎండల్లో వుంటారు. ఆ స్కిన్ టోన్ వేరుగా ఉంటుంది. ఎన్ని మేకప్ లు ట్రై చేసిన ఫేక్ గా అనిపించేది. నాగ సాధువుల్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. తమన్నా గారు ఎండల్లో వుంటే పింకిష్ గా మారతారు. అసలు మేకప్ లేకుండానే చేద్దామని అనుకున్నాం. డిజైనర్ నేతలుల్లా గారికి ఈ విషయం చెప్పాను. నేను రిఫరెన్స్ గా తీసుకున్న కాస్ట్యూమ్స్ అన్ని పంపించాను. ఆవిడ ఒక రెండు డిజైన్స్ వేశారు. ఫైనల్ గా ఇప్పుడు చూస్తున్న లుక్ ని ఓకే చేసాం. ఈ లుక్ ని ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టింది. లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
-ఈ సినిమా కోసం తమన్నా గారు ఎండలో చెప్పులు లేకుండా నటించారు. కంప్లీట్ శాకాహారిగా మారిపోయారు. తమన్న గారు స్విచ్యువల్ జర్నీలో ఉన్నారు కాబట్టే ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగారని నేను భావిస్తున్నాను. తను ఈ క్యారెక్టర్ ని ఎఫర్ట్ లెస్ గా పెర్ఫార్మ్ చేశారు.
ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో హ్యాపీగా ఉన్నారా?
వెరీ హ్యాపీ. ఇండియన్ సూపర్ స్టార్ సినిమాల్లో ఉండే క్వాలిటీ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. దాదాపు 150 మంది విఎఫ్ఎక్స్ నిపుణులు గత ఆరు నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
ట్రైలర్లో అరుంధతి పశుపతి ఛాయలు కనిపించాయి?
ట్రైలర్లో అలా అనిపించవచ్చేమో కానీ సినిమాలో చూసుకుంటే అరుంధతికి ఈ సినిమాకి పోలిక లేదు. ఈ రెండు కూడా దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. ఇది ఒక ప్రేతాత్మకి పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం.
– ఈ సినిమాలో విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ఈ సినిమాకి మూడో భాగం ప్లాన్ చేస్తున్నారా?
ఇలాంటి సినిమాలకి మనం ఏది ప్లాన్ చేయలేం. అవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేయాలనే భావిస్తాను. ఇది ఆ కాలభైరవుడే రాయించాడనే భావిస్తున్నాను.
శర్వానంద్ గారితో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది?
అది రియల్ ఇన్సిడెంట్స్ నీ ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా. మహారాష్ట్ర ఆదిలాబాద్ బోర్డర్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలు దాన్ని ఫిక్షన్ గా మార్చి చేస్తున్నాం. 1960లో జరిగిన కథ.