“తకిట తదిమి తందాన” చిత్ర రివ్యూ

గణ ఆదిత్య, ప్రియా కొమ్మినేని ప్రముఖ పాత్రలు పోషిస్తూ గంగవ్వ, జయ నాయుడు, సతీష్ సరిపల్లి, ఆదియోగి, జిత్తినాదిత్య ఇతరులు కీలకపాత్రలో పోషిస్తూ రాజు లోహిత్ రచనా దశరథంలో చందన్ కుమార్ కొప్పుల నిర్మాతగా ఫిబ్రవరి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తకిట తదిమి తందాన. ఈ చిత్రానికి నరేన్ రెడ్డి సంగీతాన్ని అందించుగా అర్జున్ సినిమాటోగ్రఫీ చేశారు. రొమాంటిక్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది అనే విషయానికి వస్తే….

కథ:
వాస్తవాన్ని అంగీకరించి తన పరిస్థితి బయటికి చెప్పి ఓపెన్ గా ఉండడానికి ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యి ఓవర్ కాన్ఫిడెంట్ తో లేనిపోని కష్టాలను తెచ్చుకుని ఓ యువకుడి కథగా చెప్పుకోవచ్చు.

నటీనటులు నటన:
చిత్రంలో హీరోగా గణాధిత్య మంచి పర్ఫామెన్స్ కి ఇచ్చారు. సినిమాలో ప్రతి సీన్లను తనదైన శైలిలో కణాదిత్య నటించగా తనకు పోటీగా ప్రియా కామినేని తనదైన శైలిలో గ్లామర్ గా నటించారు. అదేవిధంగా గంగవ్వ సతీష్ ఆదియోగి తమ పాత్రల పరిధిలో తాము నటిస్తూ చిత్రానికి బోనస్గా నిలిచారు. అదేవిధంగా జితిన్ ఆదిత్య, జయనాయుడు తదితరులు తమ పాత్రలో ఇమిడిపోయి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు.

సాంకేతిక విశ్లేషణ:
రాసుకున్న కథను అమలు చేస్తూ తనదైన శైలిలో చిత్రదర్శకత్వాన్ని విజయవంతం చేయడంలో రాజ్ రోహిత్ విజయం సాధించాలని చెప్పుకోవాలి. నిర్మాణ విలువలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని రూపొందించారు. అలాగే సినిమాకు తగ్గట్లు పాటలు, సీన్లకు తగ్గట్లు మంచి విజయంతో నరేందర్ రెడ్డి చక్కటి సంగీతాన్ని అందించారు. అర్జున్ తన సినిమాటోగ్రఫీ స్కిల్స్ తో చిత్రానికి బోనస్ గా నిలిచారు. కలర్ బ్యాలెన్సింగ్, సిట్యుయేషన్కు తగ్గట్లు కామెడీ వంటి ఇతర వాటిలో డైరెక్టర్ తగ్గా జాగ్రత్తలు తీసుకుని మంచి అవుట్పుట్ అందించారు.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, సంగీతం, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది.

సారాంశం :
యూత్ ను ఆలోచింపచేసే చేసే ఒక చక్కటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది.