‘ఠాగూర్’ మధు.. ‘క్రాక్’ మధు‌గా పేరు మార్చుకుంటారా?

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఠాగూర్ మధు ఒకరు. ఆయన అసలు పేరు బి.మధు. 2003లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఠాగూర్ సినిమాకు మధు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అప్పట్లో ఆయనను అందరూ ఠాగూర్ మధు అని పిలుస్తూ ఉండేవారు. దీంతో ఆయన తన స్క్రీన్ పేరును ఠాగూర్ మధుగా మార్చుకున్నారు.

tagore madhu krack madhu

ఠాగూర్ తర్వాత ఆయన నిర్మించిన సినిమాలు హిట్ కాలేదు. తెలుగులో ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో ఠాగూర్ మధు నిర్మించారు. ఇక విశాల్ పందెం కోడి 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకా కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. అవి హిట్ కాలేదు.

కానీ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. నిర్మాతగా మళ్లీ ఠాగూర్ మధు సక్సెస్ అందుకున్నారు. చాలాకాలం తర్వాత సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పుడు క్రాక్ మధుగా పేరు మార్చుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.