నేను పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణం-టబు

ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న టబుకు 50 ఏళ్లు వచ్చినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఈ భామ వెల్లడించింది. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి నటుడు అజయ్ దేవగణ్ కారణమని ఆమె బాంబ్ పేల్చింది.

నేను, అజయ్ దేవగణ్ మంచి ఫ్రెండ్స్. 25 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహితం ఉంది. అజయ్ మాకు మంచి సన్నిహితులు. అంతేకాకుండా నా కజీన్ సమీర్ ఆర్యకు అతడు మంచి ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య స్నేహం మంచి రిలేషన్‌కు దారి తీసింది. నేను యువ వయస్సుల్లో ఉనప్పుడు నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే వారిని అజయ్, నా కజీన్ కలిసి కొట్టవారు అని టబు చెప్పింది.

తాను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగణ్ కారణమని, ఆ రోజు చేసిన పనికి అతడు చింతిస్తున్నాడని తాను అనుకుంటున్నానని టబు తెలిపింది.