నటుడు రావు రమేష్ చేతుల మీదుగా టేబుల్ బుక్ లాంచ్

ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుండి 100000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో కొంత మందికి గోల్డ్ మెడల్స్, మరి కొంతమంది కి నేషనల్ ర్యాంక్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని. ఈ యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్, లలిత కళా తోరణం లో అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీనటుడు రావు రమేష్ మరియు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులు కు బహుమతులు ప్రధానం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహాయం చేసే గొప్ప ఈ గుణ్ణం అందరకీ ఉండాలి అన్ని అన్నారు.

రావు రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాయంగ్ ఉండడం దానికంటే ఏది గొప్పది కాదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… గత 32 సంవత్సరాలుగా ఈ మహాకార్యానికి లయన్ కిరణ్ గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలుగు రాష్ట్రం అన్ని కలలకి అన్ని సంస్కృతులకు అన్ని సంప్రదాయాలకి ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు మంచి చేయాలి అనే ఉదేశ్యం తో ఈ కార్యక్రమం చేయడం. విద్య పట్ల ఆరోగ్యం పట్ల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన బాధ్యతని ప్రాధాన్యతను తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సిల్క్ ఇండియా యూనివర్సిటీ గానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి తప్పతప్పకుండా మంచి భవిష్యత్ అందించాలి అని కృషి చేస్తున్నారు.