అడిగిన ప్రతి ఒక్కరికీ సాలిడ్ గా ఖర్చులకి ఇచ్చి పడేస్తుంది

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదు శ్రుతితప్పిన ప్రతి ఒక్కరికీ సాలిడ్ ఆన్సర్స్ ఇస్తుంది సొట్ట బుగ్గల తాప్సి. తెలుగు తమిళ హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న తాప్సి, రీసెంట్ గా కంగనా సిస్టర్స్ కి సాలిడ్ కౌంటర్ వేసింది. ఇది మర్చిపోయే లోపు తాప్సి, ఒక రిపోర్టర్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరుగుతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కి హాజరైన తాప్సి, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.

ఈ సందర్భంగా రిపోర్టర్స్ కి ఇంగ్లీష్ లో సమాధానాలిస్తున్న తాప్సిని, ఒక మీడియా పర్సన్ “మీరు బాలీవుడ్ నటి కదా హిందీలో మాట్లాడట్లేదు, హిందీలో మాట్లాడండి” అన్నాడు. తాప్సి, అక్కడ ఉన్న రిపోర్ట్స్ కి మీ అందరికీ హిందీ వచ్చా అని అడిగింది. చాలా మంది సైలెంట్ గా ఉండడంతో ” అందరికీ హిందీలో సమాధానం చెబితే అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాను, అయినా నేను తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమా కూడా సినిమాలు చేశాను. ఆ భాషలు కూడా మాట్లాడగలను. వాటిలో మాట్లాడనా?` అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో భాషాభేదంతో మాట్లాడుతున్న రిపోర్టర్ సైలెంట్ అయిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.