తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రభంజనం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి వచ్చి అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తోంది. యూనానిమస్ హిట్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 39 కోట్లు రాబట్టిన సైరా సినిమా, రెండో రోజు కూడా వర్కింగ్ డే అయినా కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 9.96కోట్లు రాబట్టి, నాన్ ప్రభాస్ రికార్డు సృష్టించింది. మొత్తం మీద సైరా సినిమా రెండు రోజుల్లో 47.24కోట్లు రాబట్టి 50 కోట్ల మార్క్ టచ్ చేయడానికి రెడీగా ఉంది. మెగాస్టార్ కి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చి నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి కానీ సైరా సెకండ్ డే భారీ వసూళ్లు రాబట్టి ఆ నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ లేపేసింది.

సైరా 2 డేస్ ఏరియా వైజ్ షేర్స్:
నైజాం: 12.12 కోట్లు
సీడెడ్: 7.30 కోట్లు
వైజాగ్: 6.28 కోట్లు
ఈస్ట్: 5.29 కోట్లు
వెస్ట్: 4.37 కోట్లు
కృష్ణ: 3.75 కోట్లు
గుంటూరు: 5.73 కోట్లు
నెల్లూరు: 2.40 కోట్లు
ఓవరాల్ 2 డేస్ కలెక్షన్స్: 47.24 కోట్లు