భారీ బడ్జట్ తో తెరకెక్కిన మెగాస్టార్ సైరా సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న సైరా తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్లలో విడుదలవుతుండగా మిగితా అన్ని భాషల్లో కలుపుకొని దేశ వ్యాప్తంగా 3600 థియేటర్లలో విడుదలకానుంది. అలాగే ఓవర్సీస్ లో సైరా సినిమా 1000కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సైరా మొదటి రోజు 4600 థియేటర్లలో సందడి చేయనుంది. ట్రేడ్ ఎనాలిసిస్ ప్రకారం మొదటి రోజు సైరా 40నుండి 50 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టేలా కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రీమియర్స్ కలెక్షన్స్ రూపంలో సైరా సినిమాలో టాప్ టులో ఒకటిగా నిల్చె అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ రూపంలో తీవ్ర పోటీ ఎదురుకానుంది. వార్ కూడా భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో హిందీలో సైరా మొదటి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి కానీ ప్రీబుకింగ్ లో సైరా అందరి అంచనాలని తలకిందులు చేస్తోంది. ఇప్పుడు నార్త్ లో ఉన్న హైప్ కి లాంగ్ రన్ లో సైరా హిందీ వెర్షన్ మాత్రమే వంద కోట్లు వసూళ్లు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.