125 కోట్ల రికార్డు బిజినెస్ చిరు సొంతం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. భారీ బడ్జట్ తో తెరకెక్కిన సినిమాకి అంతకన్నా భారీగానే బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ టీవీ 125 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు.

అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా సుదీప్ వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో సినిమాకి కేవలం టాలీవుడ్ లోనే కాక మిగతా భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.