‘శ్యామ్ సింగరాయ్’ మొదలైంది

ట్యాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. నాని చేస్తున్న 27వ సినిమా ఇది. వెంకట్ బోయినపల్లి దీనిని నిర్మిస్తుండగా.. సాయిపల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. ఇవాళ పూజ కార్యక్రమాలు నిర్వహించగా.. నానితో పాటు హీరోయిన్లు ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NANI

డైరెక్టర్లు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రీప్టును అందించగా.. నాని తండ్రి మొదటి క్లాప్ కొట్టాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ దర్శకత్వం వహించగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మ్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో నాని 70 ఏళ్ల వయస్సు మళ్లిన ప్రయోగాత్మక పాత్రలో నాని నటించనున్నాడు. పిరియాడిక్ మూవీలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోల్‌కత్తా నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తుండగా.. దీంతో పాటు ‘అంటే.. సుందరానికి’ అనే సినిమాలో నటించనున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలవ్వగా.. ఇందులో లుంగీ కట్టుకుని సింపుల్‌గా నాని కనిపించనున్నాడు. ఇక విజయదశమి రోజు విడుదలైన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.