`స్వ‌యంవ‌ద`ట్రైలర్ ను ఆవిష్క‌రించిన ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి

swayamvada trailer launched by Kodandarami Reddy

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం `స్వ‌యంవ‌ద`. ఈ సినిమా ట్రైలరును ప్రముఖ దర్శకులు A. కోదండరామిరెడ్డి విడుదల చేసారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ,`ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుందని పిస్తోంది. పెద్ద ఆర్టిస్టు లు కలసి నటించిన ఈ సినిమా ఎప్రిల్ 26న రిలీజ్ అవుతొంది. వివేక్ మొదటి సోనిమానే అయినా ఎంతో బాగా తెరకెక్కించారు. అని అన్నారు.

దర్శకులు వివేక్ వర్మ మాట్లాడుతూ:మా స్వయంవధ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కోదండరామిరెడ్డి గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినాయి.U A సర్టిఫికెట్ వచ్చింది.సినిమా చూసి సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశారు అని ప్రశంసించారు అని అన్నారు.

నిర్మాత రాజా దుర్వాసుల మాట్లాడుతూ: మా ట్రైలర్ ను ఆవిష్కరించి మా యూనిట్ ని ఆశీర్వదించిన దర్శకులు కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదములు. ఎప్రిల్ 26న దాదాపు 200లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారు అని అన్నారు.

ఈ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృస్‌న ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌.