మే 17న స్వయంవద విడుదల

హారర్ చిత్రాల్లో విభిన్న తరహా కథా కథనాలతో రూపొందిన సినిమా స్వయంవద. ప్రేక్షకులు ఆశ్చర్యపడేలా సరికొత్త నేపథ్యాన్ని ఈ సినిమాకు ఎంచుకున్నారు దర్శకుడు వివేక్ వర్మ. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటించిన స్వయంవద సినిమా మే 17న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా స్వయంవద ప్రేక్షకుల ముందుకు అన్ని ప్రముఖ కేంద్రాలలో ప్రదర్శనకు రాబోతోంది. సస్పెన్స్, హారర్, కామెడీ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిందీ చిత్రం.

Swayamvada

Swayamvada

స్వయంవద విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ…అత్యధిక థియేటర్ లలో మీ అభిమాన కేంద్రాలలో సినిమాను విడుదల చేసేందుకే మరికొంత సమయం తీసుకున్నాం. మే 17న విడుదలకు మాకు అన్ని మంచి థియేటర్స్ లభించాయి. ఓ మంచి చిత్రాన్ని చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే మా ఆలోచన. కామెడీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో సరికొత్త అనుభూతిని అందిస్తుంది స్వయంవద. పాటలు, టీజర్, ట్రైలర్ కు వచ్చిన స్పందన మా నమ్మకాన్ని పెంచుతోంది. రేపు సినిమా చూశాక కూడా ఇలాంటి ప్రశంసలే వస్తాయని ఆశిస్తున్నాం. ఇదొక విశిష్టమైన కథ. నాయిక పాత్ర ఆరు విభిన్న గెటప్ లలో కనిపిస్తుంది. సకుటుంబంగా చూసేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కథనం సాగుతుంది. అన్నారు.

అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌