బాలీవుడ్ టాలెంటేడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి రెండు నెలలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా మృతి వెనుక మిస్టరీ ఏ మాత్రం వీడలేదు. రోజుకో కథనం జనాల్లో కన్ఫ్యూజన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఇటీవల రియా చక్రవర్తి మరో హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
దిల్ బేచారాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి నటించిన సంజనా సంఘి, సుశాంత్ పై మీటూ ఆరోపణలు చేసిందని అందువల్లే సుశాంత్ డిప్రెషన్ కి గురయ్యాడాని రియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇవ్వగా ఆ కామెంట్స్ పై సంజనా వెంటనే క్లారిటీ ఇచ్చింది. నేను అలాంటి కామెంట్స్ చేయలేదు. అవి కేవలం అబద్ధమైన వార్తలు మాత్రమే. అయినా ఎప్పుడో వాటిపై నేను క్లారిటీ ఇచ్చాను. అనవసరంగా నన్ను ఈ కేసులోకి లాగాలని ప్రయత్నాలు చేయవద్దు. వీలైనంత త్వరగా అసలు నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా అని సంజన తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.